Telangana: బీజేపీ కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. తనపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే బండి సంజయ్‌కి పరువు నష్టం నోటీస్ పంపినట్టు కేటీఆర్ ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
