Prabhas: బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు చెబితే దేశమంతా అభిమానుల్లో జోష్ పీక్స్‌కు చేరుకుంటుంది. పాన్ ఇండియా ఐకాన్‌గా వెలుగొందుతున్న ఈ హీరోతో సినిమా చేయడానికి దిగ్గజ దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ప్రభాస్ మాత్రం తన సినిమా ప్రాజెక్టులతో సూపర్ బిజీ. ఇలాంటి సమయంలో ఓ బడా బ్రాండ్ అడ్వర్టైజ్‌మెంట్ కోసం ఆయనకు ఏకంగా రూ.25 కోట్ల ఆఫర్ వచ్చిందట. కేవలం మూడు రోజుల షూట్‌కే ఈ భారీ ఆఫర్! కానీ, ప్రభాస్ ఠక్కున ‘నో’ అనేశాడు. ఇండస్ట్రీలో మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లు వాణిజ్య యాడ్స్‌లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాడు. గతంలోనూ ఇలాంటి లాభదాయక ఆఫర్లను ఆయన తిరస్కరించారు. ఈ నిర్ణయం ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ ఫోకస్, డెడికేషన్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా ప్రేక్షకుల కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశంగా నిలిచాయి.
