Tea in Summer: చాలా మందికి ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. నిజానికి వాళ్ళు ఉదయాన్నే లేచి ఏదో ఒకటి చేయాలి, అంటే వాళ్ళ కడుపులో టీ పడాలి. వాటికి శీతాకాలం, వర్షాకాలం లేదా వేసవికాలం వంటి సీజన్ లతో సంబంధం లేదు. వాళ్ళు ఉదయం లేచారా వేడి టీ తాగారా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు. మీరు కూడా ఈ కోవలోకే వస్తారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. వేసవిలో టీ తాగితే కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో టీ తాగడం మంచిది కాదు. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. టీ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపులో పుల్లని సమస్యలు వస్తాయి.
నిద్రలేమి: టీలోని కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తుందని మనందరికీ తెలుసు. వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి..కాబట్టి రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు.
Also Read: Summer Skincare: వేసవిలో వేడి నీటితో స్నానం చేస్తున్నారా..? మీకు ఈ సమస్యలు ఖాయం
పొడి చర్మం: వేసవిలో ఎండ చర్మం పొడిబారిపోతుంది. దురద, మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. అదనంగా టీలోని కెఫిన్ చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
మలబద్ధకం: వేసవిలో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది.
ఆందోళన పెరుగుతుంది: వేసవి వేడి రోజురోజుకూ పెరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అదనంగా మీరు టీ తాగితే అందులోని కెఫిన్ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.