Empuran

Empuran: మొత్తానికి డబుల్ సెంచరీ కొట్టేసిన ఎంపురాన్!

Empuran: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, వెర్సటైల్ యాక్టర్-డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘L2: ఎంపురాన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ‘లూసిఫర్’ సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మొదట్నుంచి భారీ హైప్ క్రియేట్ చేసింది. మార్చి 27న గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ ఓపెనింగ్ డే నుంచే సాలిడ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.

తాజా అప్‌డేట్ ప్రకారం, కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి సంచలనం సృష్టించింది. మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డ్ రేర్ అంటూ సినీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి.ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో కనిపించారు. దీపక్ దేవ్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది.

Also Read: NTR – Neil: భారీ రేటుకి NTR – నీల్ మూవీ నార్త్ అమెరికా డీల్!

Empuran: రిలీజ్‌కు ముందు నుంచే అభిమానుల్లో అంచనాలు పీక్స్‌కు చేరడంతో ఈ మూవీ బంపర్ ఓపెనింగ్స్ అందుకుంది. మంచి టాక్‌తో పాటు కలెక్షన్స్‌లోనూ దూకుడు చూపిస్తున్న L2: ఎంపురాన్, టోటల్ రన్‌లో ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *