Robinhood: టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “రాబిన్ హుడ్” బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. “భీష్మ” తర్వాత వచ్చిన ఈ చిత్రం మరోసారి పక్కా ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ ఉగాది సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయిన ఈ మూవీ.. యూఎస్ మార్కెట్‌లో బంపర్ ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజునే అక్కడ లక్ష డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌తో అదరగొట్టింది.ప్రస్తుతం యూఎస్‌లో స్టడీగా కలెక్షన్స్ రాబడుతున్న “రాబిన్ హుడ్”.. వీకెండ్‌లో ఎలాంటి నంబర్స్ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో “ఆదిపురుష్” ఫేమ్ దేవదత్త నాగే విలన్‌గా కనిపించగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. అంతేకాదు.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా సాలిడ్ క్యామియోతో సర్‌ప్రైజ్ చేశారు. జీవి ప్రకాష్ అద్భుతమైన సంగీతంతో సినిమాకు బలం చేకూర్చగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. మొత్తంగా “రాబిన్ హుడ్” బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
ROBBING HEARTS IN THE USA!🇺🇲 With $100k+ Gross and Counting🔥🔥#Robinhood North America Rls by @ShlokaEnts
Book your tickets now!🎟️@actor_nithiin @sreeleela14 @VenkyKudumula @davidwarner31 @gvprakash #RajendraPrasad @vennelakishore @DevdattaGNage #SaiSriram @EditorKoti… pic.twitter.com/853V3orVf1
— Shloka Entertainments (@ShlokaEnts) March 29, 2025