Ugadi 2025

Ugadi 2025: ఉగాది రోజున మెగా అభిమానులకు సూపర్ ట్రీట్!

Ugadi 2025: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనిని పూర్తి చేశాడు. ఇటీవల సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం సమయంలో ఈ సినిమా గురించి మాట్లాడి, అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాడు.ఈ సినిమాలో చిరంజీవి అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించనున్నాడట. ఈ సినిమా క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని హామీ ఇచ్చాడు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర కొత్తగా, ఆయన న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో ఉంటుందని తెలిపాడు.ఇదిలా ఉంటే, ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది రోజున ప్రారంభం కానున్నట్లు సమాచారం వినిపిస్తోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Actor Vishal: స్టేజ్ పైనే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *