Jagan: వైఎస్సార్ జిల్లా పులివెందులలో సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్త పవన్‌కుమార్ కలిశారు. ఇటీవల పవన్‌కుమార్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో, తనపై విచారణ సమయంలో డీఎస్పీ, సీఐ కొట్టారంటూ ఆయన జగన్ వద్ద ప్రస్తావించారు. ఈ సందర్భంగా జగన్ ఆయన్ను ఓదార్చి, “మూడు సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి రాగానే, అదే డీఎస్పీ, సీఐ నీకు సెల్యూట్ కొట్టిస్తారు. అంతవరకు ధైర్యంగా ఉండు,” అంటూ భరోసా ఇచ్చారు.
ఈ కేసు నేపథ్యంలో, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో నిందితుడు సునీల్‌యాదవ్ ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం పవన్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘వైఎస్ అవినాష్ అన్న యూత్’ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా పవన్‌కుమార్ ఉన్నట్టు గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణ సమయంలో జరిగిన హింస గురించి పవన్‌కుమార్ జగన్ వద్ద ప్రస్తావించగా, ఆయన ధైర్యం నూరిపోశారు.
ఇది కూడా చదవండి: Cricket Betting: క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడి బలి
ఇదివరకే మంగళవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా పవన్‌కుమార్‌కు 41-ఏ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.