Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనిలో ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా అవసరాన్ని గమనిస్తే, ఏదైనా చేయాలనుకున్నారంటే.. అనుకున్న వెంటనే ఆ పనిని చేసేయడమే ఆయనకు తెలుసు. అలా ఆయన సహాయం అందించిన సందర్భాలు ఎన్నో. కౌలు రైతులకు ఆర్థిక సాయమైనా… అగ్ని ప్రమాదంలో సర్వ కోల్పోయిన జాలరులను ఆదుకోవడంలో అయినా… పవన్ ఇలా అనుకుని అలా రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా పవన్ తీరులో, ఈ తరహా వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ. మన్యం జిల్లాలో ఓ మారుమూల పల్లెలో ఓ పాఠశాలను ఆయన పునర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందుకోసం ఆయన పూర్తిగా తన సొంత నిధులనే ఖర్చు పెడుతున్నారు.
అల్లూరి సీతారామారాజు మన్యం జిల్లా పరిధిలోని అనంతగిరి మండలం బల్లగరవ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ పనులను పరిశీలించిన తర్వాత తిరుగు ప్రయాణంలో బల్లగరవ గ్రామానికి ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామంలోని పాఠశాల వద్ద ఆగారు. ఓ 43 మంది పిల్లలు చదువుతున్న పాఠశాల అది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల భవనంలోనే పిల్లలు చదువుతున్నారు. తాగు నీటి వసతి లేదు. మరుగుదొడ్లు జాడే లేదు. అలా పాఠశాల పరిసరాల్లో కాసేపు ఒంటరిగా తిరగాడిన డిప్యూటీ సీఎం… పెన్నూ పేపర్ తీసుకుని ఏదో నోట్ చేసుకోవడం కనిపించింది అక్కడి వారికి. ఆ తర్వాత ఆ సంగతి పెద్దగా పట్టించుకోలేదు ఆ గ్రామస్తులు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది.
Pawan Kalyan: అవసాన దశలో ఉన్న సదరు పాఠశాల భవనాన్ని ఏ ప్రమాదం జరగకముందే నేటమట్టం చేశారు. దాని స్థానంలో దాని కంటే ఒకింత పెద్దగా, విశాలంగా పాఠశాల భవన నిర్మాణాలు ప్రారంభించారు. దాని పక్కనే బోరు వేశారు. ఆ బోరులో నిండా నీరు పడింది. పాఠశాల భవనం, దాని పరిసరాల చుట్టూ ఎంచక్కా ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ఆ ప్రాంగణంలోనే పిల్లలకు మరుగుదొడ్లు కూడా నిర్మాణం అవుతున్నాయి. ఈ పనులన్నీ కూడా సర్కారీ నిధులతో చేపట్టే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఓ ఆర్డర్ వేస్తే ఇట్టే పనులు జరిగిపోతాయి.
అయితే ఆ తంతు అంతటినీ పక్కన పెట్టేసిన పవన్… ఆ పాఠశాల నిర్మాణానికి పూర్తిగా తన నిధులనే వెచ్చిస్తున్నారు. ఆ పాఠశాల పరిశీలన సందర్భంగా పవన్ మదిలో ఏం మెదిలిందో.. ఏ జ్ఞాపకాలు వెంటాడాయో తెలీదు కానీ… ప్రస్తుతం ఆ గ్రామానికి ఓ చక్కని పాఠశాల అన్ని వసతులతో తయారవుతోంది. నిజానికి ఆ మారుమూల గ్రామానికి పలానా కావాలని అడిగేవాళ్లు వాళ్లు కూడా లేరు. అలాంటి చోట బడి కట్టించే గొప్ప మనసున్న పవన్…. పేదలకు అన్నం పెట్టే గుడిని కూల్చేశారంటూ ఇటీవల విమర్శలు ఎదుర్కోవడం ఇక్కడ గమనార్హం.
Also Read: Bank: బ్యాంకు లావాదేవీలకు ఈ రోజే త్వరపడండి.. లేకుంటే 4 రోజులు ఆగాలి
Pawan Kalyan: ఇక రెండో సంఘటన ఇటీవల పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు సంబంధించింది. నేల ఈనిందా అన్నట్లుగా మొన్న చిత్రాడలో కనిపించిన దృశ్యాలు ఇంకా కళ్లముందే మెదలుతున్నాయ్. లక్షలాది మందికి మంచినీరు, ఆహారం, స్నాక్స్ వంటి ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం తర్వాతి రోజు చూస్తే… పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలతో చుట్టు పక్కల పరిసరాలు నిండిపోయాయి. దీంతో తమ బాధ్యతను గర్తించిన జనసైనికులు, పిఠాపురం జనసేన నేతలు రంగంలోకి దిగిపోయారు.
చిత్రాడలోని సభా వేదిక ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటూ… ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోకుండా వేరు చేసి తరలించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికర పోస్టు చేశారు తన ఎక్స్ ఖాతా నుండి. రాజకీయ కార్యక్రమాలు కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా సరే పర్యావరణాన్ని, పరిసరాలను ధ్వంసం చేసేలాగా నిర్వహించకూడదనీ, వేడుకలు నిర్వహించిన వారు, తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి స్థానికులకు అందించడమే వారికి అందించే గౌరవమని పేర్కొన్నారు. “పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం” జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతమని గుర్తు చేశారు.