Cm revanth: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, రాష్ట్ర యువత భవిష్యత్తును మెరుగుపరిచే చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా “రాజీవ్ యువ వికాసం” పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు.
రూ.6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం
ఈ పథకం కింద 5 లక్షల మంది యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్రత్యేక సాయం అందజేస్తామన్నారు. యువతకు నైపుణ్యాలు పెంచి, సరైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆదాయం, అప్పుల విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగిపోయాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వసూలు చేయాల్సిన పన్నులను సరిగ్గా వసూలు చేయలేదను చెప్పరుం
ఇసుక ఆదాయం పెరిగింది
గతంలో రోజుకు రూ.1.25 కోట్లు మాత్రమే ఆదాయం రావడం జరిగింది.ప్రస్తుతం రూ.3.50 కోట్ల వరకు ఆదాయం పెరిగిందని సీఎం వెల్లడించారు.ప్రజలకు నిజమైన వాస్తవాలు చెప్పడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.