America: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు అరవింద్ (6), అత్త సునీత (56) ప్రాణాలు కోల్పోయారు. మృతులు మాజీ సర్పంచి మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి కారు నడుపుతున్నారు.
