America: అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానం భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్ట్ నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్‌కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్‌లో వైబ్రేషన్‌ల కారణంగా అప్రమత్తమైన పైలట్, విమానాన్ని అత్యవసరంగా డెన్వర్‌కు మళ్లించి భద్రంగా దిగాడు.
అయితే విమానం టాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఇంజిన్ ఒక్కసారిగా మంటలు అంటుకుని ఆరు మంది సిబ్బందితో పాటు 172 మంది ప్రయాణికులకు ఆందోళన కలిగించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర నిష్క్రమణ ద్వారాల ద్వారా ప్రయాణికులను క్షేమంగా బయటకు తరలించారు.
Also Read: Harish Rao: హరీశ్‌రావుకు హైడ్రా బాధితుల హోలీ శుభాకాంక్షలు
America: ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి, వీటిలో ప్రయాణికులు రెక్కపై నిలబడినట్లు, సిబ్బంది వారికి సహాయం చేస్తున్నట్లు కనిపించింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించామని సంబంధిత అధికారులు వెల్లడించారు.