Vemula Veeresham: నల్లగొండ జిల్లా నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను న్యూడ్ కాల్స్‌తో బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారంరోజుల క్రితమే వేముల వీరేశానికి న్యూడ్ కాల్స్ చేశారు. ఆ తర్వాత వాట్సప్ నంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి ఎమ్మెల్యేను డబ్బులు డిమాండ్ చేశారు.
Vemula Veeresham: ఈ సమయంలో ఎమ్మెల్యే వేముల వీరేశం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆ న్యూడ్ వీడియోను కాంగ్రెస్ నాయకులకు, కొన్ని గ్రూపులకు పంపసాగారు. ఈ దశలో వారంతా ఎమ్మెల్యేకు చెప్పడంతో వెంటనే ఎమ్మెల్యే వీరేశం పోలీసులను ఆశ్రయించారు.
Vemula Veeresham: దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వారరోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. వీడియో కాల్ చేసిన నంబర్, పలువురికి వీడియోలను పంపిన నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ వెళ్లిన నల్లగొండ, నకిరేకల్ పోలీసులు అసలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Vemula Veeresham: మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో ఇక్కడి పోలీసులు నిందితులను నకిరేకల్‌కు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేకు ఎందుకు చేయాల్సి వచ్చింది. గతంలో ఎవరికైనా ఇదే విధంగా కాల్స్ చేసిన దాఖలాలు ఉన్నాయా? కీలక వ్యక్తి ఎవరు? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Vemula Veeresham: వారంరోజుల్లోనే నిందితులను పట్టుకోవడంపై నల్లగొండ జిల్లాలో హర్షం వ్యక్తమవుతుంది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఎందరో నగదు పోగొట్టుకున్నారని, ఇలాంటి దుండగులకు తగిన శిక్ష వేయాలని పలువురు జిల్లా నేతలు కోరుతున్నారు. మరొకరికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.