Viral News: ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లపై ఎక్కువ గడిపే అలవాటు పెరిగింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది మొబైల్ వినియోగంలో మునిగిపోయి, నిజ జీవితంలో జరిగే విషయాలను పట్టించుకోవడం మరిచిపోతున్నారు. అలా మొబైల్ ఫోన్ ఉపయోగం వల్ల పెద్ద తప్పు చేసిన ఓ తల్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక మహిళ వీధిలో నడుస్తూ, ఫోన్ కాల్‌లో మునిగిపోయి, తన బిడ్డను పార్కులో వదిలి వెళ్లిపోయింది. ఒక పెద్దాయన ఆ బిడ్డను చేతుల్లో మోసుకుంటూ, ఆమె వెంట పరిగెత్తి, ఆమెను పిలుస్తూ.. వెళ్లాడు. చివరికి ఆమె ఎవరో ఆపడానికి ప్రయత్నించారని తెలిసి తిరిగి చూసింది. తర్వాత ఆ పెద్దాయన చేతిలోంచి బిడ్డను తీసుకుని క్షమించండి అంటూ చెప్పింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో తేగ వైరల్ అయింది.
అయితే, ఈ వీడియో నిజంగా జరిగినదా? లేక ఇది ముందుగా స్క్రిప్ట్ రాసిన సన్నివేశమా? అనే విషయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఇది నిజమైన ఘటన అని భావించగా, మరికొంత మంది దీన్ని కేవలం ఒక ప్రదర్శన కోసం రూపొందించిన వీడియో అని అంటున్నారు.
Also Read: Tanishq: తనిష్క్ షోరూమ్ పై దొంగల ఎటాక్.. 25 కోట్ల రూపాయల నగల చోరీ
Viral News: ఈ వీడియోపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. “తల్లి బాధ్యత లేకుండా ఇలా ఎలా చేయగలదు?” అని కొందరు విమర్శిస్తుంటే, “ఇది స్క్రిప్ట్ చేయబడిన వీడియో మాత్రమే” అని మరికొందరు తేల్చేశారు.
ఎలా ఉన్నా, ఈ సంఘటన లేదా వీడియో అందరికీ ఒక గుణపాఠంగా మారింది. రోజురోజుకూ పెరిగిపోతున్న మొబైల్ ఫోన్ మీద ఆధారపడే అలవాటును తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.