Isha Foundation

Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట!

Isha Foundation: అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్‌, జస్టిస్ ఎన్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Also Read: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం – 57 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు

తమిళనాడులో వెల్లియంగిరి ప్రాంతంలో ఉన్న ఈశా ఫౌండేషన్ అక్రమ నిర్మాణాలు, పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణం జరిపిందని తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు (TNPCB) ఆరోపించింది. ఈ కారణంగా ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులను సవాలు చేస్తూ ఫౌండేషన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

Isha Foundation: హైకోర్టు విచారణలో ఫౌండేషన్‌ నిర్మాణాలు నిబంధనల ప్రకారమే ఉన్నట్లు తేలడంతో, టీఎన్‌పీసీబీ నోటీసులను కొట్టివేసింది. ఈ తీర్పుపై అసంతృప్తిగా ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. అయితే, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొనసాగిస్తూ, బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఈశా ఫౌండేషన్‌కు తాత్కాలిక ఊరట లభించినట్లైంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cyber Crime: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సైబర్ నేరగాళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *