USA

USA: ఇంటెలిజెన్స్ చాట్ టూల్‌లో అసభ్య సందేశాలు – 100 మంది అధికారులపై వేటు

USA: అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చాట్ టూల్‌ను అసభ్యకరమైన సందేశాల కోసం వినియోగించిన ఆరోపణలపై 100 మందికి పైగా అధికారులను తొలగించేందుకు NSA డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) సిద్ధమయ్యారు.

NSA డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ప్రకటన
ఫ్యాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసీ గబ్బార్డ్, ‘‘15 ఏజెన్సీలకు చెందిన 100 మందికి పైగా అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం. వారి భద్రతా క్లియరెన్స్ కూడా తొలగించనున్నాం. ఇది ఏజెన్సీ నమ్మకాన్ని, వృత్తిపరమైన నియమాలను ఉల్లంఘించడం’’ అని వెల్లడించారు.

ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చాట్ టూల్ అతి గోప్యమైన అంశాల చర్చ కోసం వినియోగిస్తారు. అయితే, కొందరు అధికారులు దీనిని అసభ్యకరమైన సందేశాల కోసం వాడినట్లు బయటపడింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, తద్వారా పాల్గొన్న అధికారుల వివరాలను శుక్రవారంలోగా గుర్తించాలని తులసీ గబ్బార్డ్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Black Pepper Milk: పడుకునే ముందు నల్ల మిరియాల పాలు తాగితే ఏమవుతుంది..?

NSA, DNIలు ‘‘ప్రభుత్వ వనరులను అసభ్యకరమైన చర్యలకు ఉపయోగించడాన్ని సహించబోము. సంబంధిత అధికారులను బాధ్యతల నుంచి తొలగిస్తాం’’ అని ఎక్స్ (Twitter) ద్వారా ప్రకటించాయి.

ఈ వ్యవహారం తొలుత హక్కుల కార్యకర్త క్రిస్టోఫర్ రూఫో బహిర్గతం చేశారు. ‘‘ప్రభుత్వ చాట్ టూల్‌లో ట్రాన్స్‌జెండర్‌లకు చెందిన సందేశాలు ఇంటర్‌లింక్‌లో కనిపించాయి’’ అని రూఫో తెలిపారు. ఈ వ్యవహారం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల్లో పెను దుమారం రేపింది. సంబంధిత అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని NSA స్పష్టంచేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Adinarayana: జగన్ కు జైలు తప్పదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *