Kangana Ranaut: బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకుంటుంది. తాజాగా సన్యా మల్హోత్ర నటించిన ‘మిసెస్’ సినిమా పై కంగనా రనౌత్ విమర్శలు చేసింది. జీ5 ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న ఈ సినిమాని ఉద్దేశించి కంగనా మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ చిత్రాలు వివాహ వ్యవస్థను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలను తప్పుగా చూపిస్తున్నారు. అలా చేయడం మానుకోవాలి. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలు కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంటారు. ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తుంటారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో సందేహం లేదు. బాలీవుడ్‌లో వచ్చే ప్రేమ కథా చిత్రాలు వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తగ్గించేలా చిత్రీకరిస్తున్నారు’ అని వివాదస్పద కామెంట్స్ చేసింది కంగనా. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.
