Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం బాలుడి ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్ చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో తరగతి బాలుడు ఏడో తరగతి బాలికతో వాట్సాప్ చాటింగ్ చాటింగ్‌ను గమనించిన బాలిక తల్లిదండ్రులు బాలుడికి ఫోన్ చేసిన బెదిరించిన బాలిక కుటుంబ సభ్యులు దీంతో భయపడి పురుగుల మందు తాగిన బాలుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు.
తొమ్మిదో తరగతి చదివే బాలుడు. చేతిలో ఫోను. ఫోన్ లో వాట్సాప. ఓ బాలిక తో చాటింగ్. చాటింగ్ ఏమి చేసాడు అనే దాని కన్నా చాటింగ్ చూసిన ఆ బాలిక అమ్మ , నాన్నా …ఇదేంటి ఇది ఇలా మా అమ్మాయి తో చాట్ చేస్తున్నావ్ అని నిలదీశారు. ఏమి తెలుసు ఆ చిన్నారికి..తెలిసి తెలియని వయసు. భయపడ్డాడు . ఏమి చేయాలో తెలియక చనిపోయాడు.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన మనోజ్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న బాలికతో 9వ తరగతి చదివే బాలుడు వాట్సాప్ చాటింగ్ చేశాడు. ఇది గమనించిన బాలిక కుటుంబసభ్యులు బాలుడిని బెదిరించారు. దీంతో భయపడిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Cockroach milk: బొద్దింక పాల గురించి మీకు తెలుసా..? గేదె పాల కంటే మూడు రెట్లు బెటర్..
మనోజ్ తన స్కూల్లోనే ఏడవ తరగతి చదువుతున్న బాలికతో చనువు ఏర్పడింది. దీంతో మనోజ్, బాలికతో రోజు వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. బాలుడిని గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చెరుకున్నారు. బాలుడి తల్లి రోదన చూసిన వారందరి కళ్లు చెమ్మగిల్లాయి.