Damagundam:తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నౌకాదళానికి చెందిన వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్ రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రం మంత్రి బండి సంజయ్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Damagundam:2027లో పూర్తికావాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ రాడార్ స్టేషన్ నిర్మాణానికి 2,900 ఎకరాలను రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు గతంలోనే ఆ భూమిని అప్పగించింది. రాడార్ స్టేషన్‌తోపాటు దామగుండం అటవీ ప్రాంతంలోనే టౌన్‌షిప్ నిర్మాణం కానున్నది. దీనిలో పాఠశాలలు, దవాఖాన, బ్యాంకు, మార్కెట్ వంటి సదుపాయాలు ఉంటాయి.
Damagundam:ఈ రాడార్ కేంద్రంలో 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది పనిచేస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే టౌన్‌షిప్‌లో 2,500 మంది నుంచి 3,000 మంది వరకు నివసించే అవకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా దామగుండ్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు.
Damagundam:అయితే సముద్ర తీరంలో ఏర్పాటు చేయాల్సిన ఈ కేంద్రాన్ని ఎంతో విలువైన అటవీ సంపద ఉన్న దామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై పర్యావరణ వేత్తలు, స్థానికులు, గ్రామాలు, తండాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రవహించనున్న మూసీ అంతర్దానం అవుతుందన్న ఆందోళన నెలకొన్నది. కానీ, ఎట్టకేలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఏర్పాటుకే ముందుకెళ్తున్నాయి.

