Kishan reddy: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నాసిరకం ఖనిజం లభిస్తుందని, అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల నిధులు వృథా అవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కులగణనను ఏ ఒక్క బీసీ సంఘం కూడా అంగీకరించలేదని వ్యాఖ్యానించారు. అయితే, సర్వే పూర్తయి బీసీ సంఘాలు మద్దతు తెలపినట్లయితే, కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం ఇప్పించేందుకు తాము ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, దీరి ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

