Srisailam

Srisailam: శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై సమావేశం

Srisailam:  శ్రీశైలంలో నవంబరు 2 నుండి డిసెంబరు 1 వరకు కార్తికమాసోత్సవాలు నిర్వహించనున్నారు ఈ కార్తికమాస ఏర్పాట్లు భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ ఈవో పెద్దిరాజు సమావేశం నిర్వహించారు సమావేశంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది డీఎస్పీ, సిఐ స్థానిక పోలీసులు పాల్గొనగా సమావేశంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను ఆదేశించారు ఆయా ఏర్పాట్లన్నీ ఈనెల 31 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యంగా కార్తీకమాసాంతం గర్భాలయంలో అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశారు అలానే శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో మినహా మిగిలిన రోజులలో సామూహిక అభిషేకాలు విడతల వారిగా భక్తులకు అవకాశం కల్పిస్తామని ఈవో పెద్దిరాజు ప్రకటనలో తెలిపారు. అలానే రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన నిలిపి అమ్మవారి ఆశీర్వచన మండపంలో జరిపిస్తామన్నారు కార్తీక దీపారాధనకు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని అలానే నవంబర్ 15న కార్తీక పౌర్ణమి కావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి,సారే సమర్పణ,జ్వాలతోరణం నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope: ఇవాళ ఈ రాశి వారికి స్త్రీల వల్ల లాభం కలుగుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *