Superstar Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు నుంచి క్రేజీ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. మహేష్ కి హైదరాబాద్ లో తన ఏఎంబి మాల్ అండ్ థియేటర్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇది కూడా చదవండి: Chandra Babu on Jagan: సెటైర్లు వేయడంలో బాబు రూటే సపరేటు.. జగన్ పేరెత్తకుండానే ఇచ్చి పారేశారుగా !
అయితే ఇప్పుడు అందులో ఆడియెన్స్ కోసం ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించేందుకు ముందడుగు వేశారు సూపర్ స్టార్ మహేష్. హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా కంప్లీట్ రాయల్ గా లగ్జరీ స్పెషల్ స్క్రీన్స్ తో కూడిన థియేటర్స్ ని “MB LUXE” గా తన మాల్ లో నిర్మించి అనౌన్స్ చేశారు. దీనితో ఈ విజువల్స్ చూసి అంతా ఓ రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు.