Samatha kumbh 2025:రంగారెడ్డి జిల్లా పరిధిలోని ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం సమతాకుంభ్-2025 వేడుకలకు ముస్తాబైంది. ఫిబ్రవరి 9 నుంచి ఇదే నెల 19 వరకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల పేరిట ఈ వేడుకలు జరగనున్నాయి.
Samatha kumbh 2025:రామానుజాచార్యులు జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆరంభ స్నపనం, అంకురారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మానవాళికి సమతా సందేశాన్నిస్తూ ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
Samatha kumbh 2025:ఫిబ్రవరి 10న సూర్యప్రభ వాహన సేవ, 12న రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం, 13న ఆచార్య వరివస్య, 15న శాంతికల్యాణ మహోత్సవం, 16న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం, 18న రథోత్సవం, చక్రస్నాన ఘట్టాలు జరుగుతాయి.
Samatha kumbh 2025:ఈ పదిరోజుల ఉత్సవాల్లో నిత్యం సుప్రభాత సేవ, అష్టాక్షరీ మంత్ర జపం, విష్ణు సహస్రనామ పారాయణం, 18 దివ్యదేశమూర్తులకు గరుడ సేవ తదితర ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభన పంచనున్నది.
Samatha kumbh 2025:శ్రీరామునుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. జైశ్రీమన్నారాయణాయ అంటూ సమతా యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వరకు జరిగే సమతాయాత్రలో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ముఖ్య అతితిగా పాల్గొంటారని తెలిపారు.
Samatha kumbh 2025:ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశంలోని ప్రముఖ రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులతోపాటు ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే పలువురు భక్తులు అక్కడికి చేరుకున్నారు. 10 రోజుల పాటు జరిగే వేడుకల్లో నిత్యం పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఆ మేరకు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

