Mokshagna: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ(Mokshagna) సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి మోక్షజ్ఞ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ స్టోరీతో ఈ ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో ఈ సినిమా అసలు ఉంటుందా ఉండదా అని అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు హీరోయిన్ గా నటిస్తుందని కూడా టాక్ వినిపించింది. కాగా ఇప్పుడు అభిమానులు మరో హీరోయిన్ పేరు సజస్ట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Fauji: ప్రభాస్ సినిమాలో అనుపమ్ ఖేర్!
మోక్షజ్ఞ పక్కన ఈ అమ్మడు అయితే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకూ ఆబ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె మీనాక్షి చౌదరి. ఈ హాట్ బ్యూటీ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లతో హిట్స్ అందుకుంది. దాంతో ఇప్పుడు మోక్షజ్ఞ పక్కన మీనాక్షి అయితే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.