TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి కీలక నిర్ణయం వెలువడింది. ఇకపై ప్రతీ ఏటా అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ అవార్డులను ప్రత్యేకంగా ఫిబ్రవరి 6న జరుగు తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లో అందజేయాలని ఛాంబర్ నిర్ణయించింది.
ప్రభుత్వం ప్రకటించే సినీ అవార్డులతో పాటు, ఫిల్మ్ ఛాంబర్ తన తరపున ప్రత్యేకంగా అవార్డులను అందజేయనుంది. అంతేకాదు, తెలుగు సినిమా పుట్టిన రోజును మరింత విశిష్టంగా నిర్వహించేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకుంది. సినీ పరిశ్రమలో పని చేసే ప్రతీ నటుడు, టెక్నీషియన్ ఇంటిపై, అలాగే థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Donald Trump: మహిళల క్రీడాపోటీల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం!.. ట్రంప్ కీలక నిర్ణయం
ఈ జెండా డిజైన్ రూపకల్పన బాధ్యతను రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.