Nimmala Rama Naidu: ఎంత ఎదిగినా… సామాన్యుడిగా ఉండటం అందరికీ సాధ్యం కాదు. అయితే… ఆడంబరాలుకు దూరంగా ఉండే రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అందరిలో ఒక్కడిలా కలిసిపోతుంటారు. పెనుగొండ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి వాసవీ మాత పూజలో పాల్గొని, వెనుతిరిగిన మంత్రి మార్టేరు లో చిన్న టి షాపులో టీ తాగుతూ కనిపించారు. వెళుతున్న కాన్వాయ్ ఒక్కసారిగా ఆగటం, మంత్రి దిగి టి అడగడంతో ఆశ్చర్య పోయిన షాపు యజమానురాలు హుషారుగా టి తయారు చేసి మంత్రికి అందించారు. రుచిగా బాగుందంటూ మంత్రి కితాబు నివ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు టి షాపు యజమానురాలు.
