Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ పాలనను కోరుకుంటున్నారోనని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సోషల్ మీడియా సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ సర్వేపై ఇప్పుడు తీవ్ర చర్చలు సాగుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులపై పోస్టులు వెలుస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పెట్టిన ఆ సర్వే వివరాలు ఏమిటో పరిశీలిద్దాం.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? అని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోల్ పెట్టింది. ఈ పోల్‌కు రెండు సమాధానాలు ఇచ్చింది. అందులో మొదటిది కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఫామ్‌హౌజ్ పాలన అని, రేవంత్‌రెడ్డి పాలనను ఉద్దేశించి ప్రజల వద్దకు పాలన అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఈ సర్వేలో పాల్గొన్న వారు ఇచ్చిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కు శరాఘాతమేనని చెప్పుకోవచ్చు.

Telangana: కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతా వేదికగా నిర్వహించిన ఈ సర్వే ప్రకారం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనకు మద్దతు ఇవ్వడం లేదని తేటతెల్లమైంది. ఈ పోల్‌లో గంట క్రితం వరకు 71,815 మంది ఓటేయగా, అందులో అత్యధికులు కేసీఆర్ పాలనకే మొగ్గు చూపుతూ ఓటేశారని తేలింది. మిగతా వారు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నట్టు తేలింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ పాలన కన్నా కేసీఆర్ పాలనను ఎక్కువగా కోరుకుంటున్నారని సూచిస్తున్నది.

