Health Tips

Health Tips: కిడ్నీల ఆరోగ్యానికి ఈ పండ్లు తింటే చాలు..

Health Tips: కిడ్నీ.. మన శరీరంలోని టాక్సిన్‌లను క్లీన్ చేసే ఫిల్టర్‌గా పనిచేస్తుంది. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే, టాక్సిన్స్ రక్తంలో కలిసిపోతాయి. దాంతో శరీరం ఉబ్బిపోవడంతో పాటు మొత్తం పనిచేయకపోవచ్చు. కిడ్నీలు మొత్తం శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. అయితే మారిన జీవనశైలి, ఆహారం వల్ల చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కానీ కొన్ని పండ్లు రెగ్యూలర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీలను క్లీన్ గా ఉంచుకోవచ్చు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం

ఎరుపు, బ్లాక్ గ్రేప్స్:
కిడ్నీ టాక్సిసిటీకి ఎర్ర ద్రాక్ష చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది. కిడ్నీ వాపును నిరోధించే ఫ్లేవనాయిడ్స్ ఇందులో ఉంటాయి. అలాగే ఎర్ర ద్రాక్షలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మూత్రపిండాలను డీప్ గా క్లీన్ చేస్తుంది. అంతేకాకుండా ఎర్ర ద్రాక్షలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

బెర్రీలు లేదా స్ట్రాబెర్రీలు:
బెర్రీస్‌లో స్ట్రాబెర్రీ, క్రాన్‌బెర్రీ, బ్లూ బెర్రీ, రోజ్ బెర్రీ, జామూన్ మొదలైనవి ఉన్నాయి. ఈ పండ్లలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీ కణాలలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు తగ్గుతుంది. కాబట్టి ఈ పండ్లు కిడ్నీలోని విషపూరిత మూలకాలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

పుచ్చకాయ:
మూత్రపిండాల్లోని విషాన్ని తొలగించడంలో పుచ్చకాయ చాలా బాగా పనిచేస్తోంది. పుచ్చకాయలో 90శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. పుచ్చకాయ నీరు.. కిడ్నీ దెబ్బతినేప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తోంది. పుచ్చకాయలోని లైకోపీన్ సమ్మేళనం కిడ్నీ మంటను తగ్గిస్తుంది. పుచ్చకాయ కిడ్నీలోని ఫాస్ఫేట్, ఆక్సలేట్, సిట్రేట్, కాల్షియం లెవల్స్ ను సమతుల్యం చేస్తుంది.

ఆరెంజ్, లెమన్:
నిమ్మరసం, ఆరెంజ్ కిడ్నీలను శుభ్రపరచడంలో బాగా సహాయపడుతాయి. వీటి రసం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

దానిమ్మ:
కిడ్నీలను క్లీన్ చేయడంలో దానిమ్మ చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించడంలో దానిమ్మ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

యాపిల్:
యాపిల్‌లో పొటాషియం, ఫాస్పరస్ కూడా తక్కువ. కాబట్టి మీరు మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆపిల్ బాగా తినాలి. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prabhas: పండక్కి అభిమానులకు స్పెషల్ ట్రీట్.. రాజా సాబ్ కొత్త పోస్టర్ రిలీజ్.. డార్లింగ్ లుక్ అదిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *