RC 16: సంక్రాంతి బరిలో ‘గేమ్ ఛేంజర్’గా దిగిన రామ్ చరణ్ కు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. దీని నుండి కోలుకుని.. ఇప్పుడు తన 16వ చిత్రంపై చెర్రీ దృష్టి పెట్టాడు. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఇందులో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే రెండు రోజులుగా ఈ సినిమా నుండి రెహ్మాన్ తప్పుకున్నాడని ఆ స్థాయలోకి దేవిశ్రీ వచ్చాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. రెహ్మాన్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నారని వారు తెలిపారు.
