Ravi Teja

Ravi Teja: రవితేజ బర్త్డ్ డే స్పెషల్..మాస్ మహరాజా జాతర

Ravi Teja: కొందరికి కొన్ని బిరుదులు కాస్తంత ఎబ్బెట్టుగా ఉంటాయి. బట్.. రవితేజకు పెట్టిన ‘మాస్ మహారాజా’ పేరు నూటికి నూరు శాతం యాప్ట్! రవితేజ తెర మీద కనిపిస్తే చాలు మాస్ ఆడియెన్స్ మెస్మరైజ్ అయిపోతారు.  ఎంటర్ టైన్ మెంట్ కు పర్యాయపదంగా నిలిచే రవితేజ నటన, స్టైల్, డైలాగ్స్… ఒక్కటేమిటి అన్నీ వినోదాత్మకంగా ఉంటాయి. జనవరి 26న రవితేజ పుట్టినరోజు… ఈ సందర్భంగా రవితేజకు విషెస్ చెబుతూ, ఆయన పంచిన వినోదాన్ని గుర్తు చేసుకుందాం.

జయాపజయాలతో నిమిత్తం లేకుండా రెండున్నర దశాబ్దాలకు పైగా రవితేజ కెరీర్ అప్రతిహతంగా సాగిపోతోంది. పడిపోయిన ప్రతిసారి ఫినిక్స్ పక్షిలా ఉవ్వెత్తున పైకి లేస్తున్నాడు మాస్ మహరాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎంతోమంది సెల్ఫ్ మేడ్ హీరోగా రవితేజాను గుర్తించడానికి వృత్తిపట్ల అతనికి ఉన్న అంకిత భావం, నిబద్ధతే కారణం.

‘మాస్ మహారాజా’గా జనం మదిలో నిలచిన రవితేజ, ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటూ  సాగుతున్నారు… `క్రాక్`తో కలెక్షన్ల వర్షం చూసిన మాస్ మహారాజా  ఆ పై `ధమాకా`తో బాక్సాఫీస్ ను దడదడలాడించారు… `వాల్తేరు వీరయ్య`లో తాను అన్నగా అభిమానించే మెగాస్టార్ చిరంజీవితో కలసి రవితేజ పంచిన వినోదం అభిమానులకు కితకితలు పెట్టింది.

Waltair Veerayya review: రివ్యూ: వాల్తేరు వీరయ్య | chiranjeevi-waltair-veerayya-movie-review

వాల్తేరు వీరయ్య తరువాత మళ్ళీ రవితేజకు మరో హిట్టు ఖాతాలో పడలేదు… అందుకని మాస్ మహారాజా ఫ్యాన్స్ రాబోయే రవితేజ కొత్త సినిమా ఈగల్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు… సంక్రాంతి రేసులో పందెం కోడిగా దూకవలసిన ఈగల్ ఫిబ్రవరి 9ని ఎంచుకుంది… ఈ సారి తన రెక్కల చప్పుడుతో బాక్సాఫీస్ వద్ద దుమారం రేపే ప్రయత్నంలో ఈగల్ రానుంది.

అంతకు ముందు 2021 పొంగల్ బరిలో `క్రాక్`తో బంపర్ హిట్ పట్టేశారు రవితేజ… తరువాత మళ్ళీ `ధమాకా`తో దడిబిడి దమ్మాట ఆడించారు రవితేజ… డ్యుయల్ రోల్ కాకుండానే రెండు పాత్రల్లో కనిపించినట్టుగా నటించి గమ్మత్తు చేశారు మాస్ మహారాజా…  ఆ గమ్మత్తుతోనే జనాన్ని చిత్తు చేసేశారు… మరో హిట్టునూ తన ఖాతాలో జమ చేసుకున్నారు రవితేజ.

కథ నచ్చితే చాలు ఇట్టే కనెక్ట్ అయిపోయి, ఎలాంటి పాత్రలోనైనా ప్రవేశించేస్తారు రవితేజ….  ‘రాజా ది గ్రేట్’లో సినిమా మొత్తం గుడ్డివాడి పాత్రలో రవితేజ అలరించిన తీరు, పంచిన వినోదం ఎవరూ మరచిపోలేరు… ఈ మధ్యకాలంలో బ్లైండ్ కేరెక్టర్ లో స్టార్ హీరోస్ అలరించిన దాఖలాలే లేవు… రవితేజ ఆ ఫీట్ సునాయాసంగా చేసేసి జనం మదిలో మరింతగా చొచ్చుకుపోయారు.

రవితేజ నవ్వులోనే ఓ వెటకారం ఉంటుంది… అదే జనాన్ని కట్టిపడేస్తుందని చెప్పక తప్పదు… ఆ నవ్వుతోనే తనదైన బాణీ పలికిస్తూ  సక్సెస్ రూటులో సాగుతున్నారు మాస్ మహారాజా.

కొంతమంది దర్శకులకు రవితేజ చిత్రాలే చిత్రసీమలో స్థానం కల్పించాయి… అలాంటి వారు రవితేజ కోసం మళ్ళీ మళ్ళీ వైవిధ్యమైన కథలు తయారు చేసుకొని వస్తూంటారు… రవితేజ కూడా వారికి మరో ఛాన్స్ ఇస్తూ ఉంటారు… అలా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు రవితేజ.

Raja the Great - Hotstar

సక్సెస్ తోనే కెరీర్ ఆరంభించి, తరువాత తప్పటడుగులు వేసిన వారికి కూడా రవితేజ లక్కీ హ్యాండ్ అనే చెప్పాలి… అలా కొందరు దర్శకులు రవితేజ సినిమాలతో మళ్ళీ సక్సెస్ రూటు చూసి, విజయపథంలోనే సాగిన దాఖలాలున్నాయి…  సదరు చిత్రాలలో మాస్ మహారాజా చేసిన రచ్చసైతం రంబోలా అనిపిస్తూ ఉంటుంది.

కష్టపడి పనిచేయడమే తెలిసిన రవితేజ హీరోగా సక్సెస్ అందుకోవడానికి చాలానే సమయం పట్టింది. బట్… ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే అని నమ్మే రవితేజ… దానిని పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఎంటర్ టైన్ మెంట్ కు కాస్తంత ఎమోషన్ ను మిక్స్ చేసి, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకున్నారు. 

రవితేజ చిన్నప్పుడే సినిమాలకు ఆకర్షితుడయ్యారు… ‘షోలే’ సినిమా పలుమార్లు చూసి, అందులో అమితాబ్ బచ్చన్ లా తానూ ఫైట్స్ చేయాలని తపించారు… గబ్బర్ సింగ్ లా డైలాగ్స్ చెప్పాలనీ ఆశించారు… ఇరవై ఏళ్ళు రాగానే, చదువుకు స్వప్తి పలికి, చెన్నపట్టణం చేరారు… ఆరంభంలో బిట్ రోల్స్ లో కనిపించారు… కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశారు… కృష్ణవంశీ ‘సిందూరం’లో గుర్తింపు ఉన్న పాత్రలో అలరించారు రవితేజ.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తొలి సినిమా ‘నీ కోసం’తో రవితేజ మొదటి సారి హీరోగా మారారు… ఆ సినిమా పలు బాలారిష్టాలు దాటుకొని, చివరకు వెండితెరపై వెలిగింది… జనం మదిని  గెలిచింది… ఆ చిత్రంతోనే రవితేజలో హీరో మెటీరియలే కాదు, స్టార్ సరుకు కూడా ఉందని సినీజనం గ్రహించారు.

Ravi Teja gives his health update after undergoing surgery for muscle tear: 'Excited to be back on set soon' - Hindustan Times

నీ కోసం’ సినిమా తరువాత కూడా అనేక చిత్రాలలో రవితేజ కీ రోల్స్ లో కనిపించారు… పూరి జగన్నాథ్ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’లో నటించాక ఓ హిట్ తన కిట్ లో వేసుకున్నారు రవితేజ… అదయ్యాక, ఎన్నో రోజుల తరువాత సీనియర్ డైరెక్టర్ వంశీ ‘అవును…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ తెరకెక్కించారు… అందులోనూ రవితేజ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు… ఈ సినిమా మరో విజయాన్ని రవితేజకు అందించింది.

‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సక్సెస్ చూసిన వెంటనే రవితేజకు పూరి జగన్నాథ్ ‘ఇడియట్’ రూపంలో ఓ సూపర్ హిట్ ను అందించారు… ఈ బంపర్ హిట్ తరువాత రవితేజ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించేశారు… ‘ఇడియట్’ యువతను విశేషంగా ఆకట్టుకుంది… యూత్ లో రవితేజకు ఓ స్పెషల్ క్రేజ్ కూడా ఏర్పడింది.

రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ విజయయాత్రలు చూసింది… జనానికి వినోదాన్నీ పంచింది… ‘ఇడియట్’ తరువాత వీరి కాంబోలో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ కూడా ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేసింది… దాంతో రవితేజ రేంజ్ కూడా మరింతగా పెరిగింది.

కామెడీతో కబడ్డీ ఆడడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు రవితేజ… మాస్ మహారాజా నటించిన  ఏ సినిమాలోనైనా కామెడీ సీన్స్ లో ఆయన  టైమింగ్ చూస్తే అదరహో అనిపిస్తుంది… నాలుక మడతపెట్టి కొడితే థియేటర్లలో జనానికి కితకితలు పెట్టినట్టయ్యేది… అదీ రవితేజ హాస్యాభినయంలోని పవర్!

రవితేజను పూరి జగన్నాథ్ స్టార్ హీరోగా నిలబెట్టారు… ఇక రాజమౌళి తన ‘విక్రమార్కుడు’తో రవితేజలోని నటునికి మరిన్ని మార్కులు సంపాదించి పెట్టారు… ‘విక్రమార్కుడు’ ఘనవిజయంతో రవితేజ ఎంతో ఎదిగిపోయారు… తరువాత అనేక వైవిధ్యమైన పాత్రల్లోకి ఒదిగిపోయారు.

సక్సెస్ వెనుక ఫెయిల్యూర్… ఫెయిల్యూర్ వెనకే సక్సెస్ రావడం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కామన్. రవితేజ కూడా అందుకు అతీతుడేమీ కాదు. కానీ సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగుతూ వచ్చాడు. పడి పోయిన కెరటాన్ని పట్టించుకోకుండా… పడి లేచిన కెరటాన్ని రవితేజ ఆదర్శంగా తీసుకున్నాడు. 

ప్రతిభావంతులకు తగిన అవకాశాలు కల్పించడంలో రవితేజ ఎప్పుడూ ముందుంటారు… ఒకప్పుడు తన టాలెంట్ ను చూసి, దర్శకులు ఏదో ఒక వేషం ఇవ్వక పోయి ఉంటే, తనకు గుర్తింపు లభించేదా అనీ అంటారు… బాలకృష్ణతో వరుస విజయాలు చూసి అదరహో అంటూ సాగుతోన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను తొలి చిత్రం  ‘భద్ర’లో రవితేజనే కథానాయకుడు… అప్పటి నుంచీ ఇప్పటి దాకా బోయపాటి శ్రీను తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు.

రవితేజ చిత్రాల ద్వారా దాదాపు పదిమంది దర్శకులు పరిచయమయ్యారు… అంతెందుకు రవితేజ తొలిసారి హీరోగా నటించిన ‘నీ కోసం’ శ్రీను వైట్లకు డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ… తరువాత “ఈ అబ్బాయి చాలా మంచోడు”తో అగస్త్యన్, “ఒకరాజు-ఒకరాణి”తో యోగి, “నా ఆటోగ్రాఫ్”తో ఎస్. గోపాల్ రెడ్డి, “షాక్”తో హరీశ్ శంకర్, “శంభో శివ శంభో”తో సముద్ర ఖని, “పవర్” తో బాబీ, “టచ్ చేసి చూడు”తో విక్రమ్ సిరికొండ దర్శకులుగా పరిచయమయ్యారు… ఇక “డాన్ శీను’తో గోపిచంద్ మలినేనికి అవకాశం కల్పించిందీ రవితేజనే… తరువాత రవితేజతో గోపీచంద్ “బలుపు, క్రాక్”తోనూ సక్సెస్ చూశారు.

Raviteja | మిస్టర్ బచ్చన్ స్పెషల్ లుక్ | Special Poster released from Raviteja's Mr Bachchan Movie

రవితేజ చిత్రాలతో పరిచయం అయిన వారికే కాదు, సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులకూ రవితేజ సినిమాలు కలసి వచ్చాయి… అలాంటి వారిలో సురేందర్ రెడ్డి, పరశురామ్ వంటివారు ఉన్నారు… రవితేజ సినిమాలతోనే వారు మళ్ళీ సక్సెస్ ట్రాక్ పైకి రావడం విశేషం!

అనేక చిత్రాలలో వినోదం పంచిన రవితేజ, తన అభినయంతోనూ కొన్ని సినిమాల్లో ఆకట్టుకున్నారు… రవితేజకు అచ్చివచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘నేనింతే’ ద్వారా రవితేజ ఉత్తమ నటునిగా నంది ని అందుకున్నారు… ఎంతోమంది కలలబేహారులు సినిమాల్లో ఛాన్సుల కోసం పట్టువదలని విక్రమార్కుల్లా సాగుతూ ఉంటారు… అలాంటి వారికి ప్రతినిధిలాంటి పాత్రలో రవితేజ భలేగా అలరించారు.

రవితేజలో నటుడు మాత్రమే కాదు, గాయకుడూ దాగున్నాడని ముందుగా కనిపెట్టింది సంగీత దర్శకుడు థమన్… “బలుపు, పవర్, డిస్కోరాజా” చిత్రాలలో రవితేజ థమన్ బాణీల్లో గళం విప్పి గాయకునిగానూ గమ్మత్తు చేశారు…  ఆ గమ్మత్తు సైతం జనాన్ని చిత్తు చేసింది.

రవితేజ  ‘రాజా ది గ్రేట్’లోనూ గాయకునిగా తన ప్రతిభను చాటుకున్నారు… ఈ చిత్రానికి సాయి కార్తిక్ స్వరకల్పన చేశారు… ఇందులో టైటిల్ సాంగ్ లో రవితేజ గాత్రం భలేగా సాగి గిలిగింతలు పెట్టింది.

గత యేడాది విడుదలైన రవితేజ రెండు చిత్రాలూ నిరాశను కలిగించాయి. అయితే… దానిని పట్టించుకోకుండా మాస్ మహరాజా  ఈ యేడాది `మాస్ జాతర`తో తన అభిమానులను మెప్పించడానికి రాబోతున్నారు. ఇది రవితేజాకు 75వ చిత్రం. జనవరి 26న పుట్టిన రోజు జరుపుకుంటున్న రవితేజకు విషెస్ చెబుతూ, మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటారని ఆశిద్దాం.

  • Beta

Beta feature

  • Beta

Beta feature

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *