Road Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. రోడ్డుపై ఏం జరుగుతుందో తెలిసేలోగా ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. భారీ పట్టాలను తరలిస్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై క్షతగాత్రుల హాహాకారాలతో తీవ్ర విషాదం అలుముకున్నది.
Road Accident: వరంగల్ జిల్లాలోని మామునూరులోని భారత్ పెట్రోల్ పంపు సమీపంలో రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొన్నది. ఈ ఘటనతో ఆటోపై భారీగా ఉన్న రైలు పట్టాలు పడ్డాయి. కొన్ని పట్టాలు ఇతర వాహనాలపైనా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆటోలో, ఇతర వాహనాల్లో కలిపి ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.
Road Accident: వరంగల్ జిల్లాలోని మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకొందరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. భారీగా ఉన్న పట్టాలు రోడ్డుపై, వాహనాలపై పడి ఉండటంతో వాటిని తొలగించేందుకు పోలీసులు, వాహనదారులు ప్రయత్నిస్తున్నారు.