Aam Aadmi Party

Aam Aadmi Party: కాంగ్రెస్ పార్టీకి ఆప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే..

Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం మొదలైంది. ఢిల్లీ సీఎం అతిషి, ఎంపీ సంజయ్ సింగ్ గురువారం మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేకి అని అన్నారు. ఏ బీజేపీ నాయకుడిపైనా ఆయన ఇలాంటి ఆరోపణ చేశారా? అంటూ విరుచుకు పడ్డారు. 

అతిషి మాట్లాడుతూ, ‘మాకెన్‌పై 24 గంటల్లో చర్య తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఇండియా బ్లాక్ నుంచి వేరు చేసేందుకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుతాం అని హెచ్చరించారు. 

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అండగా నిలిచిందని సంజయ్ సింగ్ అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చేదంతా కాంగ్రెస్ చేస్తోంది. అజయ్ మాకెన్ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు. ఆయన బీజేపీ స్క్రిప్ట్‌ను చదివారు. బీజేపీ ఆదేశాల మేరకు వారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయి

Aam Aadmi Party: కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ డిసెంబర్ 25న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అతిపెద్ద మోసగాడు అని అన్నారు. కేజ్రీవాల్‌ను ఒక్క మాటలో నిర్వచించవలసి వస్తే, ఆ పదం ‘ఫేక్’ అని మాకెన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఆప్‌తో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పొరపాటు అని, ఇప్పుడు సరిదిద్దుకోవాలని మాకెన్ అన్నారు. కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని నమ్మలేం. అతనికి భావజాలం లేదు, ఆలోచన లేదు. తమ రాజకీయ అభిలాష కోసం ఎంతవరకైనా వెళ్లవచ్చు. అంటూ వ్యాఖ్యానించారు. 

యూనిఫాం సివిల్ కోడ్, ఆర్టికల్ 370, పౌరసత్వ చట్టంపై కేజ్రీవాల్ బీజేపీతో కలిసి నిలిచారు. కేజ్రీవాల్ దేశ వ్యతిరేకి అని విమర్సించారు మాకెన్. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కూడా మాకెన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ఆప్, బీజేపీలకు వ్యతిరేకంగా 12 పాయింట్ల శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ మాకెన్ ఈ ఆరోపణలు చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *