Rahul Gandhi: మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన జాతీయ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, నిన్న బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
భారత స్వాతంత్ర్య పోరాటం 1924లో వేడెక్కింది. ప్రజల్లో కల్లోలం సృష్టించే లక్ష్యంతో 1924 డిసెంబర్ 27న మహాత్మా గాంధీ నేతృత్వంలో బెలగావిలో కాంగ్రెస్ జాతీయ సమావేశం జరిగింది.
అప్పట్లో ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సదస్సుకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం బెలగావిలో ‘గాంధీ భారత’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Manmohan Singh Biography: రాజీవ్ గాంధీ జోకర్ అన్నారు.. నిశ్శబ్ధ యోధుడిగా ప్రధాని అయ్యారు!
Rahul Gandhi: శతాబ్ది ఉత్సవాలను దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బెళగావిలో నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 3:00 గంటలకు కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.
కాంగ్రెస్, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా 200 మందికి పైగా నేతలు పాల్గొన్నారు. సోనియా, ప్రియాంక సమావేశానికి రాలేదు. గాంధీ రచించిన ‘మై డ్రీమ్ ఇండియా’ పుస్తకాన్ని కార్యవర్గ సభ్యులకు జ్ఞాపికగా, లెదర్ బ్యాగ్ లో మైసూర్ సిల్క్ శాలువా, చందనం సబ్బు తదితర బహుమతులను అందజేశారు.
అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో తరువాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.