ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తెలంగాణలోనూ మంచి రోజులు రానున్నాయి. తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు. అక్టోబర్ 7,2024 ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తీగల మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని..త్వరలోనే పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. టీడీపీలో చేరుతున్నట్లు చెప్పారు. అయితే తాను మనవరాలి పెళ్లి పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు మల్లారెడ్డి చెప్పారు.