Chandrahas

Chandrahas: బరాబర్ ప్రేమిస్తా అంటున్న ఆటిట్యూడ్ స్టార్

Chandrahas: ‘రామ్ నగర్ బన్నీ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. ఆటిట్యూడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతున్న చంద్రహాస్ హీరోగా ఇప్పుడు మరో సినిమా రూపుదిద్దుకుంది. ‘బరా బర్ ప్రేమిస్తా’ అనే ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు. సంపత్ రుద్ర దీనికి దర్శకుడు.

ఇది కూడా చదవండి: India Women: ఐదేళ్ల తర్వాత సిరీస్‌ను సాధించిన టీమిండియా

Chandrahas: ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ‘ఇష్టంగా’ ఫేమ్ అర్జున్ మహీ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ కానుంది. ఈ సినిమాకు ముందు ‘ఇష్టంగా’, ‘ఏక్’ చిత్రాలను డైరెక్ట్ చేసినట్టు సంపత్ రుద్ర తెలిపారు. టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు సాంకేతిక నిపుణులు సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajinikanth: రజనీకాంత్‌తో నాగ్ అశ్విన్ భారీ ప్రాజెక్ట్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *