మధ్యతరగతి వారికి రోజుకో షాక్ తగులుతుంది. నిత్యావసర వస్తువులు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు ఎవరెస్టు ఎక్కుతున్నాయి. కేజీ టమాటా సోమవారం అమాంతం పెరిగి 100 కి చేరుకుంది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హోల్ సేల్ మార్కెట్ లో కేజీ టమాటా ధర రూ. 80-90 కి అమ్ముతున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో టమాటా కేజీ ధర 100 దాటిపోయింది. వర్షానికి పంటలు బాగా దెబ్బ తినడంతో టమాటా దిగుమతి భారీగా తగ్గింది. దీంతో మార్కెట్ లో టమాటా రేటు ఒక్కసారిగా పెరిగింది.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో టామాటా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వ్యాపారస్తులు.