dil raju

Dil Raju: డ్రీమ్స్… రాజు

Dil Raju: పంపిణీ దారుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి… నిర్మాతగా విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తున్నారు ‘దిల్’ రాజు… ఎంతోమందికి తలలో నాలుకగా వ్యవహరించే దిల్ రాజు పుట్టిన రోజు డిసెంబర్ 18న. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన బాణీని గుర్తు చేసుకుందాం.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మూవీ అనే కంటే… ‘దిల్ రాజు సినిమా’ అంటేనే జనాలకు ఠక్కున కనెక్ట్ అవుతారు. అంటే తన పేరునే ఓ బ్రాండ్ గా మార్చేశారు దిల్ రాజు! ఆయన సినిమా వస్తోందంటే చాలు… చాలామంది నిర్మాతలు దారి వదులుతారు. అనేకమంది తమ థియేటర్లను ఆ సినిమా కోసం ఖాళీగా ఉంచుకుంటారు. ఇటు చిత్రసీమలోనూ… అటు ప్రేక్షకుల హృదయసీమలోనూ ఓ చక్కని స్థానాన్ని సంపాదించుకన్నారు దిల్ రాజు.

ఒకప్పుడు ఒకే సమయంలో మూడు నాలుగు చిత్రాలు ఏకకాలంలో నిర్మించిన నిర్మాతలను చూశాం. అందుకు వారి ప్లానింగ్ కారణం. ఈ తరం నిర్మాతల్లో అంతటి ప్లానింగ్ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే దిల్ రాజు పేరే ముందుగా వినిపిస్తుంది. తెలుగువారిని అలరించిన దిల్ రాజు సౌత్ ఇండియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.. కొన్నేళ్ళుగా దిల్ రాజు ప్రతి యేడాది ఐదారు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాను నిర్మించిన దిల్ రాజు… దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ‘లవ్ మీ’, ‘జనక అయితే గనుక’ చిత్రాలు ప్రొడ్యూస్ చేసి విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: Ajith Kumar: పొంగల్ బరిలో అజిత్ విడాముయార్చి

Dil Raju: సోలో ప్రొడ్యూసర్ గా తడాఖా చూపిన దిల్ రాజు… ఆమధ్య ఇతర నిర్మాతలతోనూ కలసి చిత్రనిర్మాణంలో పాలుపంచుకున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు తీశారు. ఇక ఇప్పుడైతే శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైనే ఇప్పుడే ఏకంగా మూడు చిత్రాలను రెడీ చేశారు. అందులో ఒకటి స్టార్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏకంగా అమెరికాలోనే చేయబోతున్నారు దిల్ రాజు.

విశేషం ఏమంటే రాబోయే సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’తో పాటు ఆయన మరో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా మూడు రోజుల గ్యాప్ తో విడుదల కాబోతోంది. జనవరి 14న ఆ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. వెంకటేశ్ తో ఇది దిల్ రాజు నిర్మిస్తున్న నాలుగో సినిమా కాగా! దర్శకుడు అనిల్ రావిపూడికి వెంకటేశ్ తో ఇది ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ తర్వాత మూడో చిత్రం.

ALSO READ  Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ సంచలనం డైరెక్టర్ నుంచి హీరోగా మార్పు.. 2026లో భారీ ప్రాజెక్ట్!

ఇది కూడా చదవండి: RRR: ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల

Dil Raju: సంక్రాంతి బరిలో తాను నిర్మించిన రెండు సినిమాలను విడుదల చేయడంతో పాటు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డాకూ మహారాజ్’ను కూడా నైజంలో రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు. అందుకే ఆయన్ని సంక్రాంతి రాజు అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దిల్ రాజు ఇంత దూకుడు మీదున్నాడు కాబట్టే ఆయనను అందరూ దిల్లున్న రాజు అంటున్నారు. ఆయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. ముద్దు పేరు రాజు. తొలి సినిమా ‘దిల్’. దాంతో ‘దిల్’ రాజు అయ్యారు. తొలి సినిమాతోనే నిర్మాతగా దిల్ రాజు మంచి పేరు సంపాదించారు. అప్పటి నుంచీ ఒక్కో సినిమాలో ఒక్కోలా తన బాణీ పలికిస్తూ సాగారు రాజు.

నిర్మాతగా మారక ముందు దిల్ రాజు పంపిణీదారుడు. అంతకు ముందు అనుభవం కోసం కొన్ని పంపిణీ సంస్థల్లోనూ పనిచేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ పై పట్టు సాధించగానే మిత్రులతో కలసి సొంత బ్యానర్ పెట్టుకున్నారు. అనేక విజయవంతమైన చిత్రాలను నైజామ్ ఏరియాలో విడుదల చేసి పంపిణీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు. నాటి మేటి అగ్రకథానాయకుల చిత్రాలను తెలంగాణలో పంపిణీచేసిన రాజుకు చిత్ర నిర్మాణంపై మనసు మళ్ళించిన వారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. దిల్ రాజుకు మణిరత్నం అంటే ఎంతో అభిమానం. ఆయన రూపొందించిన ‘కన్నత్తిల్ ముత్త మిట్టాల్’ను తెలుగులో ‘అమృత’ పేరుతో అనువదించారు. ఆ అనువాద చిత్రంలో దిల్ రాజు భాగస్వామి. అదే రాజు చిత్రనిర్మాణంలో తొలి అడుగు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *