Pawan Kalyan:

Pawan Kalyan: జ‌న‌వ‌రి నాటికి అమృత‌ధార‌ డీపీఆర్ సిద్ధం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Pawan Kalyan: రాష్ట్రంలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కంలో భాగంగా అమృత‌ధార ప‌థ‌కం అమ‌లుకు జ‌న‌వ‌రి నెలాఖ‌రు నాటికి డీపీఆర్ సిద్ధం చేయ‌నున్న‌ట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే కేంద్ర జ‌ల్‌శ‌క్తి శాఖ మంత్రిని క‌లుస్తామ‌ని వెల్ల‌డించారు. అమృత‌ధార ప‌థ‌కం అమలుపై విజ‌య‌వాడ‌లో బుధ‌వారం జ‌రిగిన వ‌ర్క్‌షాప్‌లో ప‌లు అంశాల‌ను ఈ సంద‌ర్భంగా చర్చించారు. జ‌ల‌జీవ‌న్ మిష‌న్ అనేది ప్ర‌ధాని మోదీ క‌ల అని, ప్ర‌తి ఇంటికీ నిత్యం 20 లీట‌ర్ల తాగునీరు ఇవ్వాల‌నేది ముఖ్యోద్దేశం అని తెలిపారు. ఈ ప‌థ‌కంలో భాగంగా ఉప‌రిత‌ల జాలాల వినియోగమే మేల‌ని తేల్చిచెప్పారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు తాగునీటి వినియోగంపై శిక్ష‌ణ ఇవ్వాల‌నేది ఉద్దేశ‌మ‌ని, దీనిలో ఐటీ వినియోగం కూడా భాగ‌మేన‌ని పేర్కొన్నారు.

Pawan Kalyan: నీరు దొర‌క‌న‌ప్పుడే నీటి విలువ తెలుస్తుంద‌ని, భీష్మ ఏకాద‌శి రోజు నీరు తాగ‌కుంటే ఎలా ఉంటుందో, నీరు దొర‌క్క‌పోతే అలా ఉంటుంద‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ వైఖ‌రి వ‌ల్ల కొంత ఇబ్బందులు క‌లిగాయ‌ని చెప్పారు. రిజ‌ర్వాయ‌ర్ల నుంచి నీరివ్వాల‌ని కేంద్రం కోరితే, కేంద్రం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని తెలిపారు. రాష్ట్రంలో 38 రిజ‌ర్వాయ‌ర్లు ఉన్నాయని, ఆ ఉప‌రిత‌లాల నీటి స‌ర‌ఫ‌రాతో ప్ర‌జ‌ల గొంతు త‌డ‌పాల‌ని తెలిపారు.

Pawan Kalyan: కానీ, గ‌త ప్ర‌భుత్వం భూగ‌ర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు రూ.4 వేల కోట్ల‌ను దుర్వినియోగం చేసింద‌ని విమ‌ర్శించారు. దీనివ‌ల్ల నిధులు ఖ‌ర్చు పెట్టినా ఫ‌లితం ద‌క్క‌లేద‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైన చోట సాంకేతిక‌త‌ను వినియోగించాల్సి ఉంటుంద‌ని తేల్చిచెప్పారు. ఆ నాడు క‌నీసం ఫిల్ట‌ర్ బెడ్ల‌ను చాలా చోట్ల మార్చ‌లేద‌ని తెలిపారు.

Pawan Kalyan: జ‌ల‌జీవ‌న్ మిష‌న్‌లో బోర్‌వెల్స్ వాడ‌టం వ‌ల్ల ఉప‌యోగం లేకుండా పోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో జ‌ల‌జీవ‌న్ మిష‌న్‌ను రాష్ట్రంలో అమ‌లుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని, అధికారులు క్షేత్ర‌స్థాయిలో స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ విజ‌య‌వంతానికి స‌హ‌క‌రించాల‌ని ఆదేశించారు. జిల్లాల వారీగా జ‌ల‌జీవ‌న్ మిష‌న్ అమ‌లుపై సాధ‌క బాధ‌కాల‌ను వివ‌రించాల‌ని కోరారు. ఇదేరోజు జ‌ల‌జీవ‌న్ మిష‌న్‌పై ఒక స్థిర‌మైన కార్యాచ‌ర‌ణ సిద్ధం కావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పిలుపునిచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *