Aus vs Ind 3rd Test: 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్నా మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. వరుణుడు ఎక్కువగా ప్రతాపం చూపించిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది, దీనికి ప్రతిస్పందనగా టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు కుప్పకూలింది దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల ఆధిక్యాన్ని పొందింది. నాలుగో రోజు ఫాలోఆన్‌ను భారత జట్టు కాపాడుకుంది. బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు చివరి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ అత్యధికంగా 84 పరుగులు చేశాడు. జడేజా కూడా 77 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Aus vs Ind 3rd Test: ఇక ఐదోరోజు విజయం కోసం బ్రిస్బేన్ టెస్టులో భారత్ 275 పరుగులు చేయాల్సి ఉండగా, అందులో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. అంటే విజయానికి ఇప్పుడు 267 పరుగుల దూరంలో ఉంది. అయితే అంతలోనే వెలుతురు సరిగా లేకపోవడంతో మ్యాచ్ ఆగిపోయింది. దీంతో పాటు టీ-బ్రేక్ కూడా తీసుకున్నారు. ప్రతికూల వాతావరణం.. వర్షం కారణంగా, 5 వ రోజు ఆట పూర్తిగా జరగలేదు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు 3 టెస్టుల అనంతరం సిరీస్ 1-1తో సమమైంది. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా ఈ మూడో టెస్టు జరిగింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మూడో గేమ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ముందంజలో ఉంటుంది.
బుమ్రా రికార్డు..
Aus vs Ind 3rd Test: బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియాలో టీమిండియా పేసర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కపిల్ దేవ్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టి ఆస్ట్రేలియా పిచ్‌పై భారత్‌కు అత్యంత విజయవంతమైన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డు సృష్టించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ 11 మ్యాచ్‌ల్లో మొత్తం 51 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ మైలురాయిని అధిగమించడంలో బుమ్రా విజయం సాధించాడు.
రెండు జట్లలో ప్లేయింగ్-11
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా మరియు మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.