Manchu Manoj: గడిచిన వారం రోజులు లో టాలీవుడ్ లో ఎనో సంఘటనలు జరిగాయి. అందులో మంచు ఫామిలీ గొడవకూడ ఒక్కటి. మంచు మనోజ్ ఒక్కడు ఒకవైపు ఉంటే మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరు ఇంకో వైపు ఉన్నారు. ఈ వ్యవహారం పోలీస్ వరకు వెళ్ళింది. తర్వాత కొంత సాధు మణిగింది. కానీ తాజాగా మంచు మనోజ్ జనసేనలో చేరబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన మంచు మనోజ్ స్పందించారు. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన మాట్లాదుతూ.. ఆ విషయం గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని అన్నారు.
అత్తయ్యగారి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ కి వచ్చాను అన్నారు. తన కూతురు దేవసేన శోభను మొదటిసారి ఆళ్లగడ్డ కి తీసుకొనివచ్చాను అన్ని అత్తయ్యగారి జయంతి కి తీసుకొని రావడం కోసమే ఇప్పటివరకు రాలేదు అని తెలిపారు. మా కుటుంబం, సోదరులు, స్నేహితులతో కలిసి ఇక్కడ కి రావడం సంతోషం గా ఉంది. ఊళ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు.