IND VS BAN: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి 24 గంటల ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 6 ఆదివారం గ్వాలియర్‌లో జరగనున్న మ్యాచ్‌కు ముందు, టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా దూరమయ్యాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ శనివారం ఒక పత్రికా ప్రకటనలో దూబే గాయం గురించి తెలియజేసింది. అతను మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరంగా ఉంటాడని తెలిపింది. దూబేకి వెన్ను సమస్య ఉందని, దాని కారణంగా అతను సిరీస్‌లో పాల్గొనలేడని బోర్డు తెలిపింది.
గాయం ఎప్పుడు.. ఎలా అయింది?
శివమ్ దూబేకి ఈ గాయం ఎప్పుడు, ఎలా వచ్చిందో బీసీసీఐ వెల్లడించలేదు. అలాగే, ప్రస్తుతానికి ఇది ఎంత తీవ్రమైనది అనే సమాచారం కూడా లేదు. ఇప్పటి వరకు గ్వాలియర్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. నిబంధనల ప్రకారం, BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌లో భాగంగా, శివమ్ దూబే నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్య బృందం పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌పై వర్క్ చేస్తాడు.
IND VS BAN: ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాలో భాగమైన శివమ్ దూబే శ్రీలంక పర్యటనలో కూడా టీమ్ ఇండియాలో భాగమైనా అక్కడ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అయినప్పటికీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత నెలలోనే, శివమ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నాడు. అక్కడ అతను 2 ఇన్నింగ్స్‌లలో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని రీసెంట్ ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది.
తిలక్ వర్మకు అవకాశం..
శివమ్ దూబే స్థానంలో యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మను సెలక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది. తిలక్ జట్టులోకి ఎంపిక కాకపోవడం పట్ల మొదట ఆశ్చర్యపోయినా ఇప్పుడు తిరిగి వచ్చాడు. 21 ఏళ్ల తిలక్ ఇంతకుముందు శ్రీలంక టూర్‌కు కూడా ఎంపిక కాలేదు కానీ ఆ సమయంలో అతని ఫిట్‌నెస్ దీనికి కారణంగా చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా తరఫున ఈ బ్యాట్స్‌మెన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇటీవల, అతను దులీప్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను సెంచరీ కూడా చేశాడు.