Hajj

Hajj: ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్ళేది ఎంతమంది అంటే..

Hajj: ప్రతి సంవత్సరం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు హజ్ చేయడానికి సౌదీ అరేబియా వెళతారు. 2025 సంవత్సరానికి సౌదీ 1 లక్షా 75 వేల 25 మంది భారతీయ యాత్రికుల కోసం హజ్ కోటాను నిర్ణయించినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. 2025 నాటికి 1,75,025 మంది భారతీయ యాత్రికుల కోసం సౌదీ అరేబియా హజ్ కోటాను నిర్ణయించిందని, దీనిని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, హజ్ గ్రూప్ ఆర్గనైజర్స్ మధ్య సర్దుబాటు చేసినట్లు ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది.

Hajj: మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు. 2025 సంవత్సరానికి కోటా 70:30 నిష్పత్తిలో హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ,హెచ్‌జిఓల మధ్య విభజించినట్టు ఆయన చెప్పారు. హజ్ 2025 కోసం, భారతదేశంలోని మొత్తం 1,75,025 మందిలో HGOలకు కేటాయించిన హజ్ యాత్రికుల కోటా 30 శాతం అంటే 52,507 అని ఆయన అన్నారు. హజ్ కోటా కేటాయింపు, హజ్ గ్రూప్ నిర్వాహకులకు సంబంధించిన నిబంధనలు – షరతులు భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ఏర్పాటు అవుతాయి. వీటికోసం వివిధ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటాయి.

 2024 – 2023 సంవత్సరాల్లో కూడా సౌదీ అరేబియా 1,75,025 మంది భారతీయ యాత్రికుల కోసం హజ్ కోటాను నిర్ణయించింది. అయితే 2019 సంవత్సరంలో సౌదీ అరేబియా భారతీయ యాత్రికుల కోటాను పెంచి 2 లక్షలకు పెంచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Varun Tej: హారర్ థ్రిల్లర్ గా వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *