Mohan babu: మంచు ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తండ్రి మీద కొడుకు మనోజ్.. కొడుకు మీద మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో పరస్పరా ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తనపై దాడి చేశారని మంచు మనోజ్ పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంటికెళ్లారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే.. పోలీసులకు మోహన్ బాబు షాక్ ఇచ్చారు.
విచారణకు నో చెప్పి.. తమ ఇంటి సమస్య తామే పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే అని అన్నారు. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారని చెప్పారు. మరోవైపు మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందని కొడుకు మంచి మనోజ్ అతని భార్య మౌనికపై కేసు పెట్టాడు.