Mumbai Bus Accident: ముంబైలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం ఏడుగురు మృతి చెందగా, 49 మందికి పైగా గాయపడ్డారు. ముంబైలోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ బెస్ట్ బస్సు పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లి అనేక మంది ప్రాణాలను బలిగొంది.
కుర్లాలోని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్ వార్డు సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. పాదచారులను, వాహనాలను ఢీకొన్న తర్వాత బుద్దా కాలనీలోని నివాస భవనంలోకి బస్సు దూసుకుపోయింది.
ఇది కూడా చదవండి: Supreme Court: పంజాబ్ రైతుల పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
Mumbai Bus Accident: కుర్లా నుండి అంధేరీకి వెళ్లే రూట్ 332లో పోలీసు వాహనాన్ని బస్సు ఢీకొనడంతో కనీసం నలుగురు పోలీసులు గాయపడ్డారు. MH01-EM-8228 నంబర్ గల బస్సు కుర్లా రైల్వే స్టేషన్ నుండి అంధేరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. 12 మీటర్ల పొడవున్న ఈ ఎలక్ట్రిక్ బస్సును హైదరాబాద్‌కు చెందిన ‘ఓలెక్ట్రా గ్రీన్‌టెక్’ తయారు చేసిందని, బెస్ట్ నుంచి లీజుకు తీసుకున్నట్లు మరో అధికారి తెలిపారు.