Telangana Weather: వర్షాకాలం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో మరో మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందనుకుంటున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జరీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనీ.. దీనికరణంగా వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. అలాగే, దీని ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాయాలు వీస్తాయని అధికారులు వెల్లడించారు.
Telangana Weather: వాయువ్య దిశల నుంచి బలంగా వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు ఉమ్మడి మెదక్, నల్గొండ, ఖమ్మంతో పాటు కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడొచ్చు అనీ, పిడుగులు పడే అవకాశం కూడా ఉండాలి అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: అయ్యో పాపం . . షాపింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు !
టాపు లేపిన వర్షాలు..
Telangana Weather: వర్షాకాలం సీజన్ ముగిసిందని ఐఎండీ ప్రకటించింది. ఈ సీజన్ లో గతంలో కంటే ఎక్కువగానే వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురిశాయని చెప్పింది. తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువగా 962.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో మరో 10 రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ ఏదైనా తుపాను లాంటి పరిస్థితి ఏర్పడితే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతె, అక్టోబర్ 15 వరకూ ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది.