Pushpa2 Collections

Pushpa2 Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్.. పుష్ప దెబ్బకు షారూఖ్ రికార్డ్ ఔట్!

Pushpa2 Collections: అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ తుఫాను సృష్టించింది. చాలా రికార్డులను మొదటి రోజే తుడిచిపెట్టేసింది.  సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ జంటగా నటించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెల్ మొదటి రోజు హిందీలో రూ.65-67 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ.65.5 కోట్లు)ను వెనక్కి నెట్టి అత్యధిక హిందీ ఓపెనింగ్ మూవీ టైటిల్ ను సొంతం చేసుకుంది.

పుష్ప 2 జవాన్ ను అధిగమించడమే కాకుండా, గతంలో కెజిఎఫ్ చాప్టర్ 2 (రూ.52 కోట్లు) పేరిట ఉన్న అతిపెద్ద సౌత్ డబ్బింగ్ హిందీ ఓపెనింగ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా తొలిరోజు ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.175 కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా అప్పీల్ ను ప్రదర్శించింది.

ఈ ఏడాది ఆరంభంలో తొలిరోజు రూ.55.75 కోట్లు వసూలు చేసిన షారుక్ ఖాన్ పఠాన్ ను వెనక్కి నెట్టి పుష్ప 2 హిందీలో బిగ్గెస్ట్ నాన్ హాలిడే ఓపెనింగ్ గా నిలిచింది. ఇవి ప్రారంభ అంచనాలు. పింక్ విల్లా వెబ్సైట్ ప్రకారం చూస్తే నిజమైన లెక్కలు వీటికన్నా ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం నార్త్ లో మాస్ సెంటర్లలో పుష్ప ఫైర్ ఒక రేంజిలో ఉందని చెబుతున్నారు. స్ట్రైట్ హిందీ సినిమాలను మించి ఈ సినిమా దూసుకుపోతోంది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా పుష్ప 2 అదిరిపోయిందని చెబుతున్నారు. సింగిల్ స్క్రీన్స్ కూడా పుష్ప మేనియాతో ఊగిపోతున్నాయని తెలుస్తోంది. లాంగ్ రన్ లో పుష్ప 2 మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ప్రేక్షకులను మెప్పించగలిగింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందో లేదో నిర్ణయించడంలో నాలుగు రోజుల వీకెండ్ కలెక్షన్ల రేంజ్ ప్రభావం చూపిస్తుంది. ఇప్పటివరకూ అందుతున్న వార్తల ప్రకారం చూస్తే పుష్ప 2 తన హవా కచ్చితంగా కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

‘పుష్ప: ది రైజ్’ సీక్వెల్ లో పుష్ప రాజ్ (అల్లు అర్జున్) అక్రమ గంధపు చెక్కల వ్యాపారంలో తన ప్లేస్ స్ట్రాంగ్ చేసుకోవడం నేపథ్యంలో ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుంది. తన ఎదుగుదల మధ్య, పుష్ప తన భార్య శ్రీవల్లి (రష్మిక మందన్న), తనను నమ్ముకున్న తనవారిని రక్షించడానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడని బలమైన పుష్పరాజ్ వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసింది పుష్ప 2. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటన ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది. సుకుమార్ టేకింగ్ కు మరోసారి సినీ అభిమానులు ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. 

ALSO READ  Rahul Gandhi: ఆర్ఎస్ఎస్ దత్తాత్రేయ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందన

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *