tirumala

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అలెర్ట్

Tirumala: తిరుపతి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకి అలెర్ట్.. తిరుమలలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం కారణంగా టీటీడీ పాలక మండలి పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది.ఇంకా తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. దింతో మూడు సెంటిమీటర్ల మేర గేట్లు ఎత్తిన అధికారులు.తిరుమల భక్తులు సహకరించాలని టీటీడీ పాలక మండలి అధికారులు కోరడం జరిగింది.తిరుమలలో భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP Rice Mafia: ఏపీ రైస్ మాఫియా కోరలు దేశవ్యాప్తంగా.. ద్వారంపూడి బ్రదర్స్ మామూలోళ్లు కాదు.. 

Tirumala: వర్షం కారణంగాల తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వున్నారు అని టీటీడీ అధికారులు చెప్పారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోందని తెలిపారు. ఇక, శనివారం 73,619 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 25,112మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ అనధికారులు పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth vs Cabinet: రేవంత్‌కు, మంత్రులకు పడటం లేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *