IAS Officers: ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఐఎఎస్ అధికారులు తమ గోప్యతను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వ విధుల్లో బిజీగా ఉండే వీరు తమ తమ కుటుంబ సభ్యులతో సరదాగా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడలేరు. భద్రతాకారణాల వల్ల థియేటర్లకు వెళ్ళలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని విజయవాడలోని ఐఏఎస్ అధికారుల సంఘం తమ అసోసియేషన్ బిల్డింగ్ లో చిన్న ప్రైవేట్ థియేటర్ ను నిర్మించింది. ఇందులో 48 మంది సినిమా చూసే వీలుంది. వీకెండ్ లో ఐఏఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులతో కలసి ప్రైవేట్ గా ఇక్కడ సినిమాలు చూడవచ్చు. దీంతో తమ సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ కు ఓ వినతి పత్రం పంపించింది ఐఏఎస్ అధికారుల సంఘం.
IAS Officers: తమ బిల్డింగ్ లోని మినీ థియేటర్ లో కొత్తగా విడుదలై సినిమాను ఉచితంగా ప్రదర్శించుకునేందుకు వీలు కల్పించాలని కోరింది. నిజానికి థియేటర్లలోనూ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు సినిమా థియేటర్లలో కాంప్లిమెంటరీ పాస్ లు ఇస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు తమ థియేటర్ లో ప్రదర్శనకు అనుమతి కోరుతున్నారు. మరి వారి అభ్యర్థనకు ఫిల్మ్ ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒక వేళ వారి థియేటర్ లో ప్రదర్శనకు అనుమతి ఇస్తే ఇకపై థియేటర్లలో కాంప్లిమెంటరీ పాసుల గొడవ తప్పుతుందేమో!