థాయ్ ల్యాండ్ లో ఘోరం జరిగింది. స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది విద్యార్థులు మృతి చెందారు. మంగళవారం ఉదయం స్కూల్ విద్యార్థులు, టీచర్లను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరింగింది. అయుత్తయ స్కూల్ పిల్లలు, సిబ్బంది విహారయాత్రకు వెళ్లి.. పతుం థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా బస్సు లో ఒక్కసారి గా మంటలు చెలరేగాయి. ఘటన గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది ఉండగా.. 25 మంది మరణించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇంకా ఎంతమంది చనిపోయారో, ఎంతమందికి గాయాలు అయ్యాయన్న విషయాలపై పోలీసులు ఆరాటిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.