V Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు కారును ఢీకొన్న మరో కారును సీసీ టీవీ పుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉంచిన వీహెచ్ కారు ముందు భాగం ధ్వంసమై ఉన్నది. ఎవరో గుర్తు తెలియని వారు ధ్వంసం చేశారని బుధవారం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో భాగంగా సమీపంలోని ఓ సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు.
V Hanumantha Rao: ఆ పుటేజీలో అర్ధరాత్రి సమయంలో అటుగా వెళ్తున్న మరో కారు ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న వీహెచ్ కారును ఎదురుగా వచ్చి ఢీకొన్న వీడియో స్పష్టం కనిపిస్తున్నది. పోలీసులు కారును గుర్తించే పనిలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

