Ap news: ప్రధాని మోదీ ఏపీలో పర్యటించరున్నారు. తన శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనను ఏపీ సర్కార్ ప్రాధాన్యంగా తీసుకుంది. లక్ష నుంచి లక్షన్నర మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 29న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనపై ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం ప్యాకేజీ ప్రకటిస్తారేమోనని ఆశిస్తున్నారు. రాష్ట్రంపై ఎలాంటి వరాలు కురిపిస్తారోనన్న చర్చ జరుగుతోంది.ఇదీ షెడ్యూల్ :ఈ నెల 29న సాయంత్రం 3:40 గంటలకు ప్రధాని మోదీ వాయుమార్గంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభావేదికకు చేరుకుంటారు.

